English   

ఆచార్యలో అదిరిపోయే డాన్సులకు చిరు గ్యారెంటీ.. 

Chiranjeevi
2020-03-25 15:57:40

బాస్ ఈజ్ బ్యాక్.. ఈ ప‌దం కేవ‌లం చిరంజీవి కోస‌మే పుట్టిన‌ట్లుంది. ఖైదీ నెం.150లో 60 ఏళ్ల వయసులో కూడా అమ్మడు కుమ్ముడు అంటూ కుమ్మేసాడు చిరంజీవి. ఆ తర్వాత సైరాలో డాన్సులు లేక ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. ఆ సినిమాలో డాన్సులు పెట్టాల్సిన అవసరం రాలేదు. దాంతో ఇప్పుడు ఆచార్యలో ఆ లోటు కూడా తీర్చేయాలని ఫిక్సైపోయాడు మెగాస్టార్. అభిమానులు కూడా అన్నయ్య చిందుల కోసం చూస్తున్నారు. ఖైదీ నెం 150లో ర‌త్తాలు, అమ్మడు కుమ్ముడు పాట‌ల్లో కుమ్మేసాడు మెగాస్టార్.. రీ ఎంట్రీలో ఫ‌స్ట్ టైమ్ అన్న‌య్య డాన్సుల్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సైరాలో మిస్ అయిపోయారు. దాంతో ఆచార్యలో భారీగానే బాకీ పడిపోయాడు. 

అందుకే ఇందులో చాలా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఆయ‌న గ్రేస్ చూసినోళ్ల‌కు.. స్టెప్స్ చూసినోళ్ల‌కు చిరు 64లో ఉన్నాడంటే అస్స‌లు న‌మ్మ‌బుద్ధి కాదు. త‌న నుంచి అభిమానులు డాన్సులు లేక‌పోతే సినిమాలు చూడ‌ర‌ని మెగాస్టార్ కు కూడా తెలుసు. అందుకే 64 ఏళ్ళ వ‌య‌సులోనూ అద‌ర‌గొడుతున్నాడు అన్న‌య్య‌. అమ్మ‌డు కుమ్ముడు, ర‌త్తాలు ర‌త్తాలు సాంగ్స్ ను మించి ఆచార్యలో డాన్సులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి మణిశర్మ మ్యూజిక్.. లారెన్స్, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ల కొరియోగ్ర‌ఫీ.. మాస్ బీట్స్ అన్నీ సిద్ధంగా ఉండబోతున్నాయి. 

More Related Stories