English   

వయసొచ్చాక తెలిసొచ్చింది అంటున్న తమన్నా.. 

Tamanna
2020-03-25 17:10:34

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కుర్రతనం కొద్దీ వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకున్నానని చెప్పింది. అలా చేసినా కూడా తనకు మంచి పేరు వచ్చిందని.. చాలా సినిమాల్లో తన పాత్రలకు గుర్తింపు రావడమే రాకుండా విజయం కూడా సాధించాయని చెప్పింది తమన్నా. 

ఇప్పుడు తన ఆలోచనలు మారిపోయానని.. అనుభవం వచ్చిన తర్వాత పాత్రల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నానని చెప్పింది ఈమె. అప్పుడు నటించిన అనుభవం ఇప్పుడు చేస్తున్న పాత్రలకు పనికొస్తుందని చెబుతుంది తమన్నా. దానికితోడు ఇప్పటికీ హాట్ షోలో మాత్రం తమన్నా తగ్గడం లేదు. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అంద‌మే ఆయుధంగా వాడేస్తుంది త‌మ‌న్నా. అప్ప‌ట్లో ఐఫా ఉత్స‌వంలో ఈమె ఉల్లిపొర లాంటి డ్ర‌స్సుతో చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా చాలా ఈవెంట్స్ లో ఊపిరి ఆగిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చ‌గొట్టింది త‌మ‌న్నా. గతేడాది విశాల్ యాక్షన్ సినిమా కోసం బికినీ కూడా వేసింది తమన్నా. ఈ సినిమాలో త‌మ‌న్నా ప‌ట్టించిన చెమ‌ట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా ఊపిరి ఆపేస్తోన్న త‌మ‌న్నా.. ఎప్పుడూ న‌డుము సోయ‌గాలు చూపిస్తూ నిద్ర చెడ‌గొడుతుంది. 

యాక్షన్ సినిమా పోస్టర్స్ లో తమన్నా సొగసులు చూస్తుంటే ఔరా అనిపించక మానదు. అయితే సినిమాల్లో ఎంతగా అందాలు ఆరబోసినా కూడా తనకు హాట్ సీన్స్ చేయడం ఇష్టం ఉండదని చెబుతుంది. కావాలంటే గ్లామర్ షో ఎంతైనా చేస్తాను కానీ హాట్ సీన్స్ చేయడమన్నా.. లిప్ లాక్ సన్నివేశాలు చేయడం అన్నా తనకు అస్సలు నచ్చదని చెబుతుంది తమన్నా. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క అన్నంత‌గా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. కేవ‌లం న‌డుము మాత్ర‌మే చూపిస్తూ త‌మ‌న్నా చేసిన హంగామాకు అక్క‌డున్న వాళ్ల మ‌తులు చెడిపోయాయంతే. బాలీవుడ్ లోనూ త‌మ‌న్నా హొయ‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి త‌మ‌న్నా ఇప్పుడు అప్పుడూ ఎప్పుడూ కేక అంతే. 

More Related Stories