English   

అందుకే పవన్ కళ్యాణ్ అందరికంటే ప్రత్యేకం...

Pawankalyan.jpg
2020-03-26 13:29:40

పవన్ కళ్యాణ్ అయితే ఏంటి.. ఆయన గొప్ప ఏంటి.. అందరిలాగా ఆయన కూడా సినిమా హీరో అంతే కదా.. ఇప్పుడు రాజకీయ నాయకుడు.. ఆయన కూడా అందరిలాంటి మనిషే.. మిగతా వారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏముంది అని అడుగుతుంటారు. అలాంటి వాళ్లకు సమాధానం తన వ్యక్తిత్వంతో మరోసారి చెప్పాడు పవన్ కళ్యాణ్. మిగిలిన హీరోలతో పోలిస్తే సామాజిక సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాడే తీరు చాలా తీవ్రంగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరికంటే ముందు ఉంటాడు పవర్ స్టార్.

ఇప్పుడు కూడా దేశంలో కరోనా వైరస్ ను పారద్రోలడానికి చేస్తున్న కృషిలో తాను కూడా భాగం అయ్యాడు పవన్. ఈ వైరస్ తో బాధపడుతున్న వాళ్లను ఆదుకోవడానికి ఏకంగా రెండు కోట్ల విరాళం అందించి ఎందుకు తాను ప్రత్యేకం అని మరోసారి నిరూపించుకున్నాడు జనసేన అధ్యక్షుడు. లక్షలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్న ఈ సమయంలో ఆయన ఏకంగా కోట్లు దానం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇలా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య సైనిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కోటి రూపాయలు ప్రకటించాడు.

ఇక ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు అందించాడు. సంపాదించిన దాంట్లో జనం కోసం ఖర్చు పెట్టడంలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుంటాడు. అందుకే మిగిలిన హీరోలతో పోలిస్తే పవర్ స్టార్ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా రాజకీయాల్లో గెలిచినా ఓడినా ఆయన ఇమేజ్ ఎందుకు అలా ఉంటుంది అనేదానికి ఇదే నిదర్శనం.

More Related Stories