English   

కరోనా మహమ్మారి మీద యుద్దానికి పవన్ రెండు కోట్ల సాయం

Pawan Kalyan
2020-03-26 14:00:33

మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌ డౌన్‌ పాటిస్తున్నా.. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య వృద్ధి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటి వరకూ  దేశంలో 649 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు.  మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్‌  వచ్చిన రోగులు ఎక్కువగా ఉన్నారు. దీంతో దీనిని అరికేట్టేందుకు సెలబ్రిటీలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ మహమ్మారిని పారద్రోలడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు.  ముందుగా రెండు రాష్ట్రాలకి చెరో యాభై లక్షలు ప్రకటించిన పవన్ ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కి మరో కోటి రూపాయలు ప్రకటించారు. 

ఇక ఆయన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక పది లక్షలు సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనకీ సన్నిహితుడు, నిర్మాత అయిన సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా మేలో విడుదల చేయాలని భావిస్తున్నా, ఈ కరోనా వలన వాయిదా పడే అవకాసం ఉంది.  

More Related Stories