English   

తండ్రి బాటలోనే రామ్ చరణ్.. బర్త్ డే బంపర్ ఆఫర్..

 Ram Charan
2020-03-26 14:47:20

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరంజీవి దారిలోనే వెళుతున్నాడు. తండ్రి చేసిన పనిని తాను కూడా చేస్తున్నాడు. సాధారణంగా యంగ్ హీరోలంతా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే సోషల్ మీడియాకు దూరంగా కనిపిస్తాడు. కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ కాబోతున్నాడు. దీనికి తన పుట్టిన రోజున ముహూర్తంగా ఎంచుకున్నాడు రామ్ చరణ్. 

మార్చి 27న ఆయన ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు తొలి ట్వీట్ చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్. సరిగ్గా 2 రోజుల కింద ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈయన వచ్చీ రాగానే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. మెగా ఎంట్రీతో అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలోనే ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈయనకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. ఇందులో తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పోస్ట్ చేయాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్. మొత్తానికి ఒకే ఏడాది అందులోనూ కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే తండ్రీకొడుకులు సోషల్ మీడియాలోకి రావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

More Related Stories