English   

మహేష్ బాబు కోటి రూపాయల విరాళం.. 

Mahesh babu
2020-03-26 15:51:50

తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా కదిలొస్తున్నారు. నిన్నటి వరకు ఏమైంది మన హీరోలకు ఒక్కరు కూడా ఆర్థికంగా ముందుకు రావడం లేదేంటి అనుకున్నారు. నితిన్ లాంటి ఒకరిద్దరు హీరోలు తప్పితే ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ముందుకొచ్చేసాడు. పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. ఇప్పుడు మహేష్ బాబు కూడా కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కోటి రూపాయలను ఇచ్చాడు. ఈయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించాడు. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్. 

ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లోంచి కాలు బయటికి పెట్టకూడదని.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దంటూ కోరాడు మహేష్ బాబు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని.. 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు సూపర్ స్టార్. అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామంటూ లెటర్ విడుదల చేసాడు. మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామంటూ తెలిపాడు మహేష్ బాబు. మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. 

More Related Stories