English   

చిరంజీవి, రామ్ చరణ్ వేర్వేరు కాపురాలు పెట్టుకున్నారా..

Ram charan
2020-03-26 16:27:05

తెలుగు ఇండస్ట్రీలో ఉమ్మడి కుటుంబాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి కుటుంబం ఇప్పుడు కలిసే ఉంటుంది. ఆదివారం అయిందంటే ఎవరెక్కడ ఉన్నా కూడా అందరూ చిరంజీవి ఇంట్లో వాలిపోతారు. పవన్ కళ్యాణ్ కూడా వీలున్న ప్రతిసారి అన్నయ్య ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. పెళ్లి తర్వాత కూడా రామ్ చరణ్ తల్లిదండ్రులతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా వేరే ఇంటికి మారిపోయినట్లు తెలుస్తుంది. భార్యతో కలిసి సపరేటుగా పెద్ద ఇల్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 

నిజానికి ప్రస్తుతం చిరంజీవి ఉన్న ఇంటిని తన టేస్ట్ కి తగ్గట్లుగా రామ్ చరణ్ 30 కోట్ల రూపాయలతో మార్పులు చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు మరి ఆ ఇంట్లో కాకుండా దానికి సమీపంలోనే రామ్ చరణ్ దంపతులు మరో ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాసన, చరణ్ ఇప్పుడు ఆ ఇంట్లోనే వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు దీనికి సరైన సాక్ష్యాలు లేవు. కానీ మొన్న జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టే సమయంలో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదికి వచ్చి క్లాప్స్ కొట్టారు. అందులో ఆయన చెల్లెల్లు బావలు మిగిలిన పిల్లలు అందరూ ఉన్నారు.. కానీ రామ్ చరణ్ దంపతులు మాత్రం లేరు. 

అదే సమయంలో రామ్ చరణ్, ఉపాసన వేరే ఇంటి బయటికి వచ్చి బాల్కనీ నుంచి చప్పట్లు కొట్టారు. అక్కడ వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరూ లేరు. దాంతో చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పుడు వేరు వేరు ఇళ్ళల్లో ఉన్నారనే విషయం అర్థమైపోయింది. నిజానికి టాలీవుడ్ లో నాగచైతన్య, మనోజ్, మంచు విష్ణు, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా తమ తల్లిదండ్రులతో కాకుండా సపరేటుగా ఉంటున్నారు. ఇప్పుడు చరణ్ కూడా ఇదే చేశాడు. అయితే దూరంగా ఉన్నారనే మాటే కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ఇంటికి భార్యతో సహా వెళ్తుంటాడు రామ్ చరణ్. కేవలం ప్రైవసీ కోసం మాత్రమే మరో ఇల్లు తీసుకున్నారని తెలుస్తోంది. 

More Related Stories