English   

సినిమా కార్మికులకు చిరంజీవి కోటి విరాళం.. 

 Chiranjeevi
2020-03-26 17:26:53

కరోనా వైరస్ కరాళ నృత్యానికి ఎన్నో వేల మంది చనిపోతున్నారు.. ఎన్నో వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు.. మరెంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. దాంతో సినిమా వాళ్లంతా పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆర్థిక సాయం చేసారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతుగా కోటి రూపాయలు అనౌన్స్ చేసాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న రోజువారి కూలీలతో పాటు కరోనా వైరస్ బాధితులకు కూడా ఈ కోటి రూపాయలు వర్తిస్తుందని చెప్పాడు చిరంజీవి. ఇది తనవంతుగా చేస్తున్న చిన్న సాయం అంటూ ట్వీట్ చేసాడు మెగాస్టార్. కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా చేయాల్సింది చాలానే ఉందంటున్నాడు చిరు. చేస్తామని చెబుతున్నాడు కూడా. హుదుద్ వచ్చినపుడు ఎలాగైతే ఆదుకున్నారో.. అలాగే ఇప్పుడు కూడా ఓ భారీ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై నిర్ణయం కూడా తీసుకోడానికి సిద్ధమవుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. 

More Related Stories