English   

కరోనా కోసం ఏయే హీరో ఎంతెంత ఇచ్చాడంటే

tollywood
2020-03-27 07:38:11

కరోనా వైరస్ కు సరిహద్దులు లేవు...అలాగే తారతమ్యాలు కూడా లేవు. పేదా గొప్ప తేడా అసలే లేదు.. ఎప్పుడు ఏ రూపంలో ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో  ఊహించడం చాలా కష్టం. మహమ్మారి తీవ్రతను తెలుసుకుని పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కూడా ఇప్పుడు ఈ వైరస్ బారిన పడుతున్నారు. సామాన్యులే కాదు...సెలబ్రిటీలను కూడా కరోనా వైరస్  చాపకింద నీరులా కబళించేస్తోంది. సినీ రాజకీయ , క్రీడా ప్రముఖుల నుంచి బ్రిటన్ రాజకుటుంబం వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు డెడ్లీ కరోనా. అందుకే ఇప్పటి దాకా తమ సినిమాలు చూసి తమను ఆదరించిన ప్రజలను, ఆ ప్రజలకు సాయపడుతున్న ప్రభుత్వానికి, అలాగే తమ సినిమా రంగానికి చెందిన కార్మికులను ఆడుకోవడానికి రెడీ అయ్యారు సినీ ప్రముఖులు. ఇప్పటి దాకా మన స్టార్స్ ఎవరెంత సాయం చేసారో చూద్దాం
నితిన్ : పది లక్షలు + పది లక్షలు (రెండు తెలుగు రాష్ట్రాలకు)
కరోనా అలెర్ట్ తో సినీ పరిశ్రమ లాక్ డౌన్ లో ఉండటంతో  తమిళ సినీ కార్మికుల సంఘానికి
నటుడు కమలహాసన్ 10 లక్షలు
దర్శకుడు శంకర్ 10 లక్షలు
నటుడు ధనుష్ 15 లక్షలు విరాళాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్: 2 కోట్లు (50 లక్షలు+50 లక్షలు (రెండు తెలుగు రాష్ట్రాలకు), ప్రధాన మంత్రి సహాయనిధికి కోటి)
మహేష్ బాబు: కోటి రూపాయలు (తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు)
చిరంజీవి: కోటి రూపాయలు
ఎన్టీఆర్ : 75 లక్షలు (25 లక్షలు+ 25 లక్షలు (రెండు తెలుగు రాష్ట్రాలకు), ప్రధాన మంత్రి సహాయనిధికి 25 లక్షలు
త్రివిక్రమ్ శ్రీనివాస్: 20 లక్షలు (తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షలు)
అనిల్ రావిపూడి: 10 లక్షలు (తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షలు)
దిల్ రాజు: 20 లక్షలు (తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షలు)
కొరటాల శివ: 10 లక్షలు (తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షలు)
వినాయక్: 5 లక్షలు సినిమా కార్మికుల కోసం..
ప్రభాస్: కోటి రూపాయలు
మహేష్ బాబు: కోటి రూపాయలు
రామ్ చరణ్: 70 లక్షలు (తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధి)
సాయి ధరమ్ తేజ్: 10 లక్షలు
రజనీకాంత్: 50 లక్షలు
విజయ్ సేతుపతి: 10 లక్షలు
సూర్య-కార్తీ : 10 లక్షలు
శివ కార్తికేయన్: 10 లక్షలు
అల్లరి నరేష్ నాంది’ నిర్మాత సతీశ్ వేగేశ్న : యూనిట్ లో రోజువారీ వేతన కార్మికులకి ఒక్కోకరికి పదివేలు

More Related Stories