English   

రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ బర్త్ డే గిఫ్ట్..

chiranjeevi
2020-03-27 07:55:13

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు మొదలైపోయాయి. మరికొన్ని గంటల్లో ఈయన 36వ వడిలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాంతో ఒక్కొక్కరుగా ఈయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరికంటే ముందు తండ్రి చిరంజీవి నుంచే ఈయనకు బర్త్ డే విషెస్ వచ్చేసాయి. దాంతో పాటు మధురమైన మరుపురాని గిఫ్ట్ కూడా ఇచ్చాడు చిరు. తన కొడుకును ఎత్తుకున్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసాడు చిరు. చరణ్ పుట్టినపుడు తానెంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. తనయుడిని అలా ఎత్తుకుని ఆడిస్తూ ఉన్న ఫోటోను చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. మార్చ్ 27న రంగస్థల దినోత్సవం అని.. ఆ రోజే చరణ్ పుట్టాడని చెప్పాడు చిరు. దాంతో చరణ్ కు నటన అనేది నీటిలో చేపకు ఈత వచ్చినట్లే అని చెప్పాడు చిరు. కొడుకును చూసుకుని ఆయన పొందుతున్న పుత్రోత్సాహం చూసి అంతా పొంగిపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవితో పాటు చరణ్ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. నిర్మాతగా, నటుడుగా చరణ్ రెండు పాత్రల్లోనూ రప్ఫాడిస్తున్నాడు.

More Related Stories