English   

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి..

 Actor Sethuraman Dead
2020-03-27 12:40:04

అసలే కరోనా వైరస్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా ఇండస్ట్రీలో అనుకోని విషాదం జరిగింది. 35 ఏళ్ల నటుడు గుండెపోటుతో కన్నుమూయడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సేతు రామన్ అకస్మాత్తుగా మరణించాడు. 2013లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం కన్న లడ్డు తిన్నా ఆశయలో ఈయనకు మంచి అప్లాజ్ వచ్చింది. సేతురామన్ వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. 

చిన్న వయస్సులో గుండెపోటుతో కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వృత్తిరీత్యా ఆయన చర్మవ్యాధి నిపుణుడు కాగా.. అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు. ఆ పరిచయాలతోనే తమిళ హాస్యనటుడు హీరో సంతానంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు సేతురామన్‌. ఈ క్రమంలోనే ఆయన హీరోగా వచ్చిన కన్నా లడ్డు తిన్న ఆశయా సినిమాలో నటించాడు. 

ఆ తర్వాత వాలిబా రాజా (2016), సక్కా పోడు పోడు రాజా (2017), 50/50 (2019) లాంటి తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఆయన మృతి చెందాడనే వార్త తమిళ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సేతురామన్ ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సేతురామన్‌కి భార్య, ఒక బిడ్డ ఉన్నారు. 

More Related Stories