English   

హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూజా

Pooja Hegde
2020-03-27 13:16:43

తెలుగులో ఇప్పుడు పూజ హెగ్డే ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు .. వరుస బ్లాక్ బస్టర్లు పూజ కెరియర్ కు బాగా కలిసి వస్తున్నాయి. తెలుగులో ఆమె స్పీడ్ చూసి తమిళం నుంచి .. హిందీ నుంచి కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొన్ననే అల వైకున్తపురమిలో అనే సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్న ఈ భామ పారితోషకం భారీగా పెంచినట్టు చెబుతున్నారు. అయినా ఆమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్ కంటే పూజ హెగ్డే అందుకున్న పారితోషికం ఎక్కువనే చర్చ సాగుతోంది. అఖిల్ కి వరుస పరాజయాలు పడటం .. పూజ వరుస విజయాలతో దూకుడు మీద ఉండటమే ఇందుకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న ఆమె బ్యాక్ బ్యాలెన్స్ ఈ దెబ్బతో ఫుల్ గా ఉందని అంటున్నారు.

More Related Stories