ఉప్పెన భామ కాదట..అనూకి చిక్కింది

తెలుగులో కొందరు కధానాయికలు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాదు. అలాంటి వారిని లిస్టు వేస్తే అందులో ముందు ఉంటుంది అను ఇమ్మానుయెల్. తెలుగులో అరడజను పైగా సినిమాలు చేసినా అన్నీ పెద్ద దెబ్బ కొట్టినవే. ఒక్క సీన్ లో నటించిన గీత గోవిందం బంపర్ హిట్ అయినా అది ఈవిడ లెక్కలోకి రాదుగా. అయితే ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోందట. ఇప్పుడు ఈ భామ మీద సుకుమార్ కన్ను పడిందని అంటున్నారు.
ఒక పక్క దర్శకుడిగా చేస్తూనే మరో పక్క నిర్మాణ సంస్థ పెట్టి తన దగ్గర పని చేసిన వాళ్ళందరినీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. కుమారి21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ కు సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని నాయికగా ఎంపిక చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడా అవకాశం అను ఇమ్మాన్యుయేల్ కి చిక్కినట్టు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.