బాలయ్యతో అప్పుడు చిన్నోడు ఇప్పుడు పెద్దోడు

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మలయాళంలో అగ్ర హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరో పాత్ర కోసం ఓ యంగ్ హీరో అవసరం కావడంతో, కొంతమంది పేర్లను పరిశీలించిన నిర్మాత మంచు విష్ణు అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలు వేరయినా బాలకృష్ణకి .. మంచు ఫ్యామిలీకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. గతంలో చిన్నోడు మనోజ్ తో ఊ కొడతారా ఉలిక్కిపడతరా అనే సినిమా కూడా చేసి ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా ఈ కాంబినేషన్ సెట్ కావొచ్చనే అనుకుంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.