English   

నాగ చైతన్య పరువు తీసేసిన సమంత అక్కినేని.. 

 samantha
2020-03-27 14:33:25

తెలుగు ఇండస్ట్రీలో సమంత అక్కినేని, చైతూ జోడీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాళ్లిద్దరికీ ఎంత క్రేజ్ ఉందనేది అందరికీ తెలుసు. సాధారణంగా హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. కానీ సమంత మాత్రం చైతూ చొరవతో కంటిన్యూ చేస్తుంది. భర్త సపోర్ట్ లేకుండా తానేం చేయలేనని చెప్పేసింది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోవడంతో ఇంట్లోనే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు ఈ జోడీ. అందులో భాగంగానే చైతూవి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఇది చూసి ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు.. ఫీల్ అవుతున్నారు కూడా. చైస్యామ్ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారనేది చెప్పాల్సిన అవసరం లేదు. భర్తతో ఫుల్ ఆడేసుకుంటుంది ఈ భామ. 

ఇప్పుడు కూడా ఇంట్లో తన పెంపుడు కుక్కతో చైతూ పడుకున్న పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా క్వారెంటీమ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం క్వారెంటైన్ చేస్తున్నారు.. అలా అర్థం వచ్చేలా చైతూకు క్వారెంటీమ్ అని పెట్టడమేంటి అంటూ సమంతను నిలదీస్తున్నారు అభిమానులు. దయచేసి అది మార్చేయండి అంటున్నారు. మరోవైపు చైతూకు గతంలో కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని.. కానీ ఇప్పుడు వాటిని బాగానే అలవాటు చేసుకున్నాడని చెబుతుంది సమంత. పెళ్లి తర్వాత కొత్త కొత్త అలవాట్లు బాగానే నేర్చుకున్నాడు చైతూ. ప్రస్తుతం ఈయన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో పాటు పరుశురామ్ సినిమాకు కమిటయ్యాడు. 

More Related Stories