కరోనా వైరస్ అరికట్టడానికి సితార పాప చెప్పిన సూత్రాలు..

కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించడానికి 130 కోట్ల జనాభా ప్రస్తుతం యుద్ధం చేస్తున్నారు. ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకుని బయటకు రాకుండా ఆ వైరస్ ను తమ గడప ముందే ఆపేస్తున్నారు. ఇక ఈ వైరస్ నుంచి మనకు మనం ఎలా రక్షించుకోవాలో చాలామంది సెలబ్రిటీలు మనకు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార కూడా ఒక వీడియో విడుదల చేసింది. ఈ వైరస్ రాకుండా ఏం చేయాలి అనేది జాగ్రత్తలు చెప్పింది సితార పాప.
1. అన్నింటికంటే ముఖ్కమైంది.. జనం అంతా ఇంట్లోనే ఉండాలి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి..
2. కనీసం 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోవాలి..
3. మీ మొహాన్ని తాకకండి.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును అసలు తాకకండి..
4. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కచ్చితంగా మీ మోచేతులను లేదంటే టిష్యూను అడ్డుగా పెట్టుకోండి..
5. సోషల్ డిస్టేన్సింగ్ అనేది తప్పదని అర్థం చేసుకోండి.. ఇంట్లో అయినా బయట అయినా ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరంలో ఉండండి..
6. మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్ని ధరించండి.. మీకు కొవిడ్-19 లక్షణాలు ఉంటే దయచేసి వైద్యున్ని సంప్రదించండి.. నమ్మదగిన సోర్సు నుంచే వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి.. కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దామంటూ వీడియోలో చెప్పింది మహేష్ బాబు కూతురు.