English   

ఇంట్లోనే చరణ్ బర్త్ డే వేడుకలు.. భార్య చేసిన కేక్‌తో.. 

Ram charan
2020-03-27 16:09:03

ప్రతీ ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగేవి. అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కరోనా వైరస్ కారణంగా అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. దాంతో ఇంటి నుంచి కాలు కూడా బయటికి పెట్టలేకపోయాడు రామ్ చరణ్. హాయిగా తన పుట్టిన రోజు వేడుకలను భార్య ఉపాసనతో కలిసి చేసుకున్నాడు ఈయన. ఈ సందర్భంగా ఆమె చేసిన కేక్ కట్ చేస్తూ సోషల్ మీడియోలో ఫోటో పోస్ట్ చేసాడు. అది చూసి అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో అందరూ హ్యాపీ బర్త్ డే చెబుతున్నారు. ఉపాసన చేసిన కేక్ అంటూ ప్రత్యేకంగా రామ్ చరణ్ చెప్పాడు. తన భార్య ముందే ఈ సారి బర్త్ డే వేడుకలు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. 21 రోజుల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే కచ్చితంగా మరికొన్ని రోజులు షూటింగ్ ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తుంది. 

More Related Stories