English   

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి.. రామరాజు లుక్ కేక.. 

RRR
2020-03-27 16:22:58

రామ్ చరణ్ అభిమానులకు చెప్పినట్లుగానే గిఫ్ట్ ఇచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సర్ ప్రైజ్ తో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ లో అల్లూరిగా రామ్ చరణ్ ఎలా ఉండబోతున్నాడనే ఆసక్తికి తెర దించేస్తూ రప్ఫాడించే టీజర్ డిజైన్ చేసాడు రాజమౌళి. ఇప్పుడు ఈ టీజర్ విడుదల చేసాడు జూనియర్. అందులో రామ్ చరణ్ లుక్స్‌తో పాటు ఆయన మేకింగ్ చూస్తుంటే బాహుబలిని కూడా మించిపోయేలా ఉంది సినిమా. అంతగా స్పెషల్ కేర్ తీసుకున్నాడు దర్శకధీరుడు. ముఖ్యంగా అల్లూరి పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలో చెప్పిన మాటలు తూటాల్లా పేలాయి. ఆ టీజర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. 

ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది..
కలబడితే వేగుసుక్క ఎగబడినట్లుంటది..
ఎదురుపడితే చావుకైనా చెమట ధారగడ్తది..
పాణమైనా బంధూక్ అయినా వానికి బాన్‌చంద్ అయితది..
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెందొర.. అల్లూరి సీతరామరాజు.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ డిజైన్ చేసాడు జక్కన్న. 

More Related Stories