English   

పవన్ సినిమాలో నేనా.. ఛాన్సే లేదంటున్న రేణు దేశాయ్..  

Renu Desai
2020-03-27 17:30:38

పవన్ కళ్యాణ్ సినిమాలో రేణుదేశాయ్ నటించబోతుందనే వార్తలు కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే రూమర్స్ వస్తేనే మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం నిజంగానే అదో పెద్ద సంచలనమే. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా రోజులుగా అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. రేణు దేశాయ్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది పవన్ కళ్యాణే. ఆయన నటించిన బద్రి సినిమాతోనే టాలీవుడ్ కి వచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత జానీ సినిమాలో నటించింది. అప్పటికే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటంతో సహజీవనం మొదలుపెట్టారు. 

ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది రేణు. పవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సినిమాలకు డిజైనర్ గా వర్క్ చేసింది. విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది రేణు దేశాయ్. దర్శకురాలిగా రైటర్ గా సత్తా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈమె. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా పింక్ సినిమా రీమేక్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి పాత్రలో నటించబోతోందని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు రేణు కూడా స్పందించింది. కరోనా వైరస్ ఇంత కల్లోలం రేపుతుంటే కూడా రూమర్స్ ఇంత బాగా ఎలా సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెబుతుంది రేణు దేశాయ్. తను పవన్ సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఇంత కూడా నిజం లేదని తెలిపింది రేణు. ఈమె మాటలు చూస్తుంటే భవిష్యత్తులో కూడా పవన్ తో నటించే ఛాన్సులు లేనట్లే కనిపిస్తున్నాయి. 

More Related Stories