పవన్ కళ్యాణ్ అసలు బయటపెట్టిన చిరంజీవి..

పవన్ కళ్యాణ్ వయసు ఎంత..? చాలా రోజుల నుంచి అభిమానులతో పాటు సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రశ్న ఇది. వికిపిడియాను అడిగితే అది కూడా తప్పు చెబుతుంది. అన్నీ చెప్పే గూగుల్ తల్లి కూడా పవన్ వయసు విషయంలో మాత్రం తడబడుతుంది. ఓ సారి 47 అంటుంది.. మరోసారి 48 అంటుంది.. కాస్త గట్టిగా అడిగితే 49 అంటుంది.. అంతేకానీ అన్నయ్య 50 దాటాడా లేదా అనేది మాత్రం చెప్పదు. కానీ ఇప్పుడు చిరంజీవి మాత్రం పవన్ వయసు చెప్పేసాడు. తమ్ముడి వయసు ఎంతంటే మీరే లెక్కలేసుకోండి అన్నట్లు ఓ ఫోటోను విడుదల చేసాడు.
పవన్ వయసును ఇప్పటి వరకు ఎవరూ పర్ఫెక్ట్ గా చెప్పలేదు. దాంతో పవన్ వయసు ఏంటి అనేది గండికోట రహస్యంలా మారిపోయింది. అసలు తమ హీరో ఏజ్ ఎంతైనా పర్లేదు ఇప్పటికీ ఎప్పటికీ తమకు యంగ్ అంటున్నారు అభిమానులు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం పవన్ వయసు ఇంత అని ఓపెన్ గా చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే అసలు పవన్ రియల్ ఏజ్ ఎంత అని కనుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఫోటో పోస్ట్ చేసాడు చిరంజీవి. అందులో చరణ్ నెలల వయసున్న చిన్న పిల్లాడు.. అప్పుడే పవన్‌కు గడ్డాలు, మీసాలు వచ్చేసాయి.
చరణ్ వయసు మార్చ్ 27, 2020 నాటికి 35 పూర్తైపోయాయి. అంటే అప్పటికి పవన్ కళ్యాణ్‌కు కనీసం 20 ఏళ్లు వేసుకున్నా కూడా 55 అవుతుంది.. అది కాకుండా 18 ఏళ్లు వేసుకున్నా కూడా 53 ఏళ్లు అవుతుంది. అయితే గతేడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లెక్కల ప్రకారం పవన్ కల్యాణ్ 02/09/1968లో జన్మించాడు. అంటే ఈ లెక్కన పవర్ స్టార్ ఏజ్ ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేసింది. కాకపోతే ఈయన లుక్స్ అలా ఉండవు కాబట్టి ఇంకా 50 ల్లోకి రాలేదంటున్నారు అభిమానులు. కానీ అసలు నిజం మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే.