English   

ఎన్టీఆర్...తాతకి తగ్గ మనవడు...ఒక్కడే నాలుగు బాషలలో...

NTR RRR.jpg
2020-03-28 09:43:34

టాలీవుడ్ లో ఎన్టీఆర్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనకు కుటుంబ పారపర్యంగా లభించిన ఫ్యాన్స్ కొందరు అయితే ఆయన నటనకు, డైలాగ్ డెలివరీకి, డ్యాన్స్ కి ఫిదా అయి ఫ్యాన్స్ గా మారిన వారు ఎందరో ఉన్నారు. సరయిన సినిమాలు పడడం లేదు కానీ పడితే మనోడు ఇక్కడ ఉండాల్సినోడు కాదనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా నిన్న చరణ్ బర్త్ డే సందర్భంగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ నుండి ఒక సర్ప్రైజ్ వీడియో వదిలారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోని రామరాజు పరిచయం చేశాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని చూసిన వాళ్ళంతా ఆహా అంటున్నారు.

మన ఊహకి అందని విధంగా రామ్ చరణ్ లుక్ ని ప్రెజెంట్ చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ వాయిస్ తో రామరాజుని పరిచయం చేయించాడు. ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ వీడియోకి నాలుగు భాషల్లో ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పాడనే అంశం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎందరో హీరోలు వేరే వేరే బాషలలో సినిమాలు చేసారు. మన సినిమాలు ఎన్నో ఇతర బాషల్లో డబ్బింగ్ అయ్యాయి. కాని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో మూడు హిందీ సినిమాలు చేసినా గొంతు వాడే సాహసం చేయలేకపోయారు. అంత ఎందుకు ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన బాహుబలికి కూడా ప్రభాస్ స్వంతంగా చెప్పే సాహసం చేయలేకపోయాడు.

కానీ ఆ సాహసం ఎన్టీఆర్ చేశారు, నిన్న రిలీజ్ చేసిన వీడియోలో తెలుగుతో పాటు తమిళ్, హింది, కన్నడలో స్ట్రెయిట్ గా యంగ్ టైగర్ వాయిస్ దుమ్ము దులిపింది. ఒక్క మలయాళం మాత్రం ఎందుకనో తేడాగా అనిపించినామిగతా అన్ని బాశాలలోనూ స్పష్టమైన ఉచ్చారణతో ఎక్కడా తడబాటు లేకుండా మంచి ప్రాక్టీసు చేసి మరీ కసరత్తు చేసినట్టు స్పష్టం అయింది. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ తన తమిళ సినిమాలకు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునేవారు ఇప్పుదు ఇన్నాళ్ళకి మనవడు కూడా అదే అడుగు జాడల్లో నడుస్తు ఒక్క బాషకే ఆగక ఏకంగా నాలుగు బాషలలో సత్తా చాటుతున్నాడు.

More Related Stories