English   

బాలీవుడ్ జెర్సీ అందుకే ఒప్పుకోలేదు అంటున్న రష్మిక 

 Rashmika Mandanna
2020-03-28 11:50:37

తెలుగులో విజయవంతమైన `జెర్సీ` మూవీ బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెల్సిందే. దిల్ రాజు అల్లు అరవింద్ లు అమన్ గిల్ అనే నిర్మాతతో కలసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా తాజాగా తెలుగు రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఇందులో హీరోయిన్‌గా రష్మికను నటింప చేయాలని ట్రై చేసినా అది కుదరలేదు దీంతో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ ని ఎంపిక చేశారు. ఒరిజినల్ ని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ కూడా గత ఏడాది మొదలయింది. 

అయితే ఈ సినిమాలో తనను అడిగినా ఎందుకు సినిమా చేయలేదు అనే విషయం చెప్పుకొచ్చింది. ఎందుకు ఆ సినిమా ఒప్పుకోలేదంటే ఆమె ఇప్పటిదాకా చేసింది అన్నీ కమర్షియల్‌ సినిమాలేనట. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారని, కానీ ‘జెర్సీ’ అలాంటి చిత్రం కాదు. భావోద్వేగంతో కూడిన సినిమా. నేను ఈ సినిమాలో నటించినా నా పాత్రకు న్యాయం చేయలేనని అనిపించి ఆ సినిమా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. అలా ఈ అవకాశం మృణాల్‌ ఠాకూర్‌కు దక్కిందట. ఇక మన జెర్సీ హైదరాబాద్ నేపద్యంలో జరగగా ఈ కథ మొత్తం 1990 నాటి ఛండీఘడ్ ప్రాంతం నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్‌ని చంఢీఘడ్ లోని క్రికెట్‌ స్టేడియంలో కూడా కొంత షూట్ చేశారట. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 28న రిలీజ్ కావాల్సి ఉంది. మరి కరోనా దెబ్బకు ఏమవుతుందో ? చూద్దాం.

More Related Stories