English   

మహేష్ సరసన కీర్తి సురేష్ 

Keerthy Suresh
2020-03-28 12:02:05

ఈ సంవత్సరం సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మాత్రం తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. 

అదేంటంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జంటగా కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. నిజానికి వీరిద్దరూ భారత్ అనే నేను సినిమాలోనే కలిసి నటించాల్సి ఉంది. చివరి నిముషంలో కియారా అద్వానీ ఎంట్రీ ఇచ్చింది. పరశురామ్ తన కథకు కీర్తి సురేష్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాడని ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారని అంటున్నారు. ప్తస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. మళ్ళీ అంతా సిద్దం అయ్యాక ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More Related Stories