English   

తేనె కళ్ళతో కైపెక్కిస్తోన్న మేఘా

Megha Chowdary
2020-03-28 12:30:05

ఒక్కో సారి ఒక్కొకరికి అందం, అభినయం అన్నీ కలిసి ఉన్నా వారికి పెద్దగా బ్రేక్ రాదు. అది మరి వారి దురదృష్టమో లేక ఛాన్స్ లు దక్కించుకున్న వారి అదృష్టమో తెలియదు కానీ ఎంత అందం ఉన్నా విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు ఉంటుంది కొందరి పరిస్థితి. అలాంటి వారిలో మేఘా చౌదరి కూడా ఉంటుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి, వీజేగా మారి అనంతరం కోలీవుడ్‌లో అడుగు పెట్టింది బెంగాలీ భామ మేఘా చౌదరీ. కథక్ లో ఫేమస్ అయిన ఈ  బ్యూటీ... కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా చేసింది. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్‌గా తమిళంలో ఆదిత్య వర్మ సినిమాతో నటించినా అది క్యాన్సిల్ అయింది. 

ఇక తెలుగులో మార్షల్, ఊరంతా అనుకుంటున్నారు లాంటి సినిమాలు చేసినా ఆమె ఎవరికీ పెద్దగా నోటేడ్ కాలేదు. అందుకే ఇప్పుడు అందాల విందుకు సై అంటూ సినిమా అవకాశాలు పట్టే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు తన అందాలే తనకు అవకాశాలు తెచ్చిపెట్టాలని చూస్తోంది. అందుకే ఎక్కడా తగ్గకుండా ఎద అందాలను పరుస్తూ పిచ్చేక్కిస్తోంది. బెంగాలీ రసగుల్లా లాంటి ఈ భామ మత్తెక్కించే తేనె కళ్లతో ఓర చూపు చూస్తూ అందాలన్నీ కెమెరా ముందు పరిచి కుర్ర కారుకు అందాల విందు అందిస్తోంది. ఆమె ఇలాగే అందాలు పరుస్తూ ఉంటే తెలుగు ఇండస్ట్రీలో వాలి మళ్ళీ మరో రెండు మూడు సినిమాలు చేసేసి పోతుందో ఏమో చూడాలి మరి.

More Related Stories