English   

అనిల్ మహేష్ కి నో చెప్పింది బాలయ్య కోసమా 

Anil Ravipudi
2020-03-28 12:51:23

కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'అతనొక్కడే' తర్వాత హిట్ కోసం చాలా సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. అలాంటి ఆయనకు ‘పటాస్‌’ తో హిట్ ఇచ్చాడు అనిల్. ఆ సినిమా కళ్యాణ్‌ రామ్‌ తో పాటు అనీల్‌ రావిపూడికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత సుప్రీం, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో మంచి ఫాంలోకి వచ్చాడు అనిల్. రాజా ది గ్రేట్‌ సమయంలోనే బాలయ్యతో అనీల్‌ రావిపూడి సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. 

గతంలో అనీల్‌ రావిపూడి ఒక కథను బాలయ్యకు వినిపించాడని, ఆ కథతో సినిమాను చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ చిత్రం వర్కౌట్‌ కాలేదు. ‘రాజా దిగ్రేట్‌’ చిత్రం తర్వాత అనీల్‌ వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ల కలయికలో దిల్‌రాజు నిర్మాణంలో ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ మూవీని చేసి హిట్ కొట్టాడు. మొన్న సంక్రాంతికి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి బంపర్ హిట్ కొట్టాడు. అయితే స్వతహాగా నందమూరి అభిమాని అయిన అనిల్ ఎలా అయినా బాలయ్యతో ఒక సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడని అంటున్నారు. 

అందుకే మహేష్ సినిమా చేయమని అడిగినా ఇప్పుడు చేయలేనని చెప్పాడట. నిజానికి బాలయ్య నుండి కబురు రావడంతోనే అనిల్ మహేష్ కి నో చెప్పాడని అంటున్నారు. అనిల్ ను ఈ మధ్య ఇంటికి పిలిపించుకున్న బాలయ్య తనకోసం మంచి సినిమా ఒకటి ప్లాన్ చేయమని అడిగాడట. ఇంకేముంది అభిమాన హీరో సినిమా చేయమంటే ఎవరు మాత్రం కాదంటారు. ప్రస్తుతం బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అన్నీ కుదిరితే ఆ సినిమా తర్వత అనిల్ తో సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

More Related Stories