క్రేజీ రీమేక్ లో..క్రేజీ కాంబో...బాలయ్యతో రానా

ఈ మధ్య ఏదయినా ఒక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నాం అంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ప్రపంచం అంత అమ్మో కరోనా అని భయపడుతున్నా నిన్న అంతా చర్చ మాత్రం ఈ ఆర్ఆర్ఆర్ లో చరణ్ సర్ప్రైజ్ గురించే నడిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆచార్య గురించి కూడా బాగా ఎక్కువగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ఒక మళయాళ సినిమా గురించి తెలుగు ఫిలిం నగర్ లో చర్చలు జరగడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి.
ఎందుకంటే మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` అనే సినిమాని తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మల్టీస్టారర్ మూవీ తెలుగు హక్కులు కొనడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అందులో ఒక పాత్ర బాలయ్య చేస్తే బావుంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నారని మరో పాత్రకు మంచు విష్ణుని నటింపచేయనున్నారని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో విష్ణు నటిస్తాడని ప్రచారం జరిగిన పాత్రలో దగ్గుబాటి రానా నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రానాతో ఈ మేరకు నాగావంశీ సంప్రదింపులు కూడా జరిపినట్టు రానా కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అనేది.