English   

తమ్ముడు మంచు మనోజ్ విడాకులపై స్పందించిన విష్ణు..

vishnu
2020-03-29 07:49:43

గతేడాది తెలుగు ఇండస్ట్రీలో అనుకోని సంచలనం మంచు మనోజ్ విడాకులు. అప్పటివరకు ఆయన భార్యతో కలిసి ఉన్నాడని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన తన శ్రీమతితో విడిపోయి మూడు నెలలు గడిచి పోయింది. ఆ తర్వాత అఫీషియల్ గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు మంచు వారబ్బాయి. దాంతో ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు మంచు విష్ణు. తన కెరీర్ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పాడు. దాంతో పాటు మంచు మనోజ్ విడాకులు తీసుకోవడంపై ఆయన స్పందన కూడా తెలియజేశాడు. నిజంగా మనోజ్ విడాకులు తీసుకుంటున్నానని చెప్పినప్పుడు తాను ఆయనకు ఒకే మాట చెప్పానని.. టేక్ యుర్ వోన్ టైం అని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి లో పీరియడ్ అనేది వస్తుంది..

అలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని మాత్రమే మనోజ్ కు తాను చెప్పానని చెప్పాడు విష్ణు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం.. కొన్ని రోజులు అదే ధ్యాసలో ఉన్నా కూడా తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటున్నట్లు చెప్పాడు మంచు విష్ణు. ఇక తన కెరీర్ విషయానికి వస్తే కొన్ని రోజుల గ్యాప్ తీసుకున్న పర్లేదు కానీ మంచి సినిమాలు రావాలని ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఏ సినిమా చేయలేదని చెప్పాడు. ప్రస్తుతం మోసగాళ్లు, భక్త కన్నప్ప సినిమాలతో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. ఇక మోహన్ బాబుకు మీరు సరైన సినీ వారసులు అనుకుంటున్నారా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది అని తెలివిగా సమాధానం చెప్పాడు మంచు విష్ణు.

More Related Stories