సింగీతం సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మల పోటీ

మన తెలుగులో సింగీతం లాంటి దర్శకులు అరుదుగా ఉంటారు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడే సైన్స్ మెషీన్ సినిమాలు తీసి మంచి పేరు సంపాదించారు ఆయన. వయసు పైబడడంతో ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు .ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నరన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈయన బాలయ్యతో ఆదిత్య 369 సీక్వెల్ తీస్తారని ప్రచారం జరిగినా ఆయన స్వర్గీయ గాయని బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ఆయన ఓ బయోపిక్ రూపొందించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో నాగరత్నమ్మ పాత్రలో అనుష్కా శెట్టి నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమాలో నటించేందుకు ఇంకో భామను కూడా సంప్రదించనున్నట్టు చెబుతున్నారు. బెంగళూరుకి చెందిన నాగరత్నమ్మ.. దేవదాసిగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారింది. అంతే కాక తన సంపదనంతా కళలకు, కళాకారులకు ధారపోసిందామె. ఈ సినిమాకి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించనున్నారట. అనుష్క తప్పుకుంటే సమంత చేయడానికి రెడీ అని సంకేతాలు పంపిందట. చూడాలి మరి ఇందులో ఇంతదాకా నిజం అవుతుందో ?