English   

సాయంలో కూడా మన హీరోలు స్వార్థం చూసుకుంటున్నారా...

Tollywood Heros.jpg
2020-03-29 09:16:35

అదేంటి అలా అంటున్నారు.. ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్క హీరో కోటి రూపాయలు రెండు కోట్లు విరాళంగా ఇస్తూ ఉంటే ఇలా అనడం ఏమైనా న్యాయంగా ఉందా అని అనుకుంటున్నారా.. అన్నేసి కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం నిజంగానే శుభపరిణామం. దాన్ని ఎవరూ తప్పు పట్టలేదు.. పట్టలేరు కూడా. అయితే మన హీరోలు ఇచ్చిన విరాళం వెనుక కొంత మంది కొన్ని కారణాలు చెబుతున్నారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. తమ తమ స్వార్థం చూసుకొని మన హీరోలు సహాయం చేశారని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి.

ఉదాహరణకు హీరో ప్రభాస్ 4 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించాడు. అందులో మూడు కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధికి అనౌన్స్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ఈయన తెలుగుతో పాటు హిందీ మార్కెట్లో కూడా కన్నేశాడు. ఉత్తరాది ప్రేక్షకుల మనస్సు దోచుకోవాలన్నా.. అక్కడ ప్రజలకు మరింత చేరువ కావాలన్నా.. మీడియా దృష్టిలో పడాలన్న ఇలాంటి సందర్భంలో ఏదో ఒకటి చేయాలి. అందుకే ఎవరూ ఊహించని విధంగా మూడు కోట్ల రూపాయలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ప్రకటించాడు ప్రభాస్. ఇక అల్లు అర్జున్ కూడా 25 లక్షలు కేరళ ప్రభుత్వానికి ఇచ్చాడు. అక్కడ ఈయనకు స్టార్ ఇమేజీ ఉంది. ఇప్పటి వరకూ మలయాళం హీరోలు ఎవరూ పెద్దగా విరాళం ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్ కేరళ ప్రభుత్వానికి 25 లక్షలు ఇవ్వడంతో అక్కడ ఈయన పేరు మార్మోగిపోతోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కంటే కూడా సినిమా కార్మికులకు కోటి రూపాయలు అందించాడు. నాగార్జున కూడా ఇదే చేశాడు. వాళ్లకు రాజకీయం కంటే కూడా సినిమా ఇండస్ట్రీలో అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సినిమా కార్మికులకు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు స్టార్ హీరోలు. ఇలా సహాయం చేసినప్పుడు ఎంతోకొంత తమ స్వార్థం కూడా చూస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

More Related Stories