కరోనా మీద ప్రశాంత్ వర్మ సినిమా...నిజమేనట

తెలుగులో అప్పటికప్పుడు పరిస్థితులని బేస్ చేసుకుని సినిమాలు చేసే దర్శకులు చాలా తక్కువ. తక్కువ అనే కంటే వర్మ తప్ప ఎవరూ లేరని చెప్పాలి. కానీ వర్మ కూడా ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చలో పడి అలాంటి సినిమాలను తీస్తున్నాడు కానీ, అవి కంటెంట్ కి తగ్గట్టుగా ఉండడం లేదు. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మీద సినిమా వర్మనే చేస్తాడని అనుకున్నారు. అయితే ఆయన ఇంకా మూడ్ లోకి వచ్చినట్టు లేడు. అందుకే తెలుగులో మరో దర్శకుడు ముందుకు వచ్చి ఈ సబ్జెక్ట్ మీద ఆయన సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు ఆ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ. కరోనా వైరస్‌పై ఆయన ముందే సినిమా అనుకున్నడని అది ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిందని కూడా అంటున్నారు. ప్రశాంత్ వర్మ ఓ భయంకరమైన వైరస్ ప్రజలను ఇబ్బంది పెడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే పాయింట్ మీద ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడట.
గత నవంబర్లోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా ఈ సినిమా పూర్తి చేసుకుందట. ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే ఈ సినిమాలో నటిస్తున్నారని అంటున్నారు. ముందు వేరే ఏదో వైరస్ అనుకున్న ఇప్పుడు కరోనా నేపధ్యంలో దానిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి వైరస్ లని బేస్ చేసుకొని హాలీవుడ్ లో అయితే చాలా సినిమాలు వచ్చాయి. అవి అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో కాదు కాదు ఇండియాలోనే ఇలాంటి సినిమాలు చాలా అరుదు. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి. నిన్న మొన్నటిదాకా అది పుకారు అనుకున్నారు కానీ నిజమేనని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.