English   

సీసీసీకి దిల్ రాజు శిరీష్ ల విరాళం

dilraju
2020-03-30 06:43:26

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరైంది. దీంతో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల్లో 21 రోజుల పాటు  లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అన్ని రంగాల కార్మికులపై  ప్రభావం పడింది. సినీ పరిశ్రమ కూడా షూటింగ్ లను నిలిపివేసింది. దాంతో సినిమాల్లో పనిచెసే రోజువారీ కూలీలకు సినీ కార్మికులకు ఆదాయం లేకుండా పోయింది. కాగా వారిని ఆదుకోవడానికి సినీ క్రైసిస్ ఛారిటీ ని ఏర్పాటు చేసారు. ఆ ఛారిటీకి ప్రముఖుల నుండి భారీ  విరాళాలలు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు సీసీసీ కి విరాళం ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు కూడా చేరారు వారు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా సినీ కార్మికుల కోసం రూ.10 లక్షలు సీసీసీకి విరాళం  ఇస్తున్నట్టు ప్రకటించారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థను నిర్మాత దిల్ రాజు 2003 లో ప్రారంభించారు. కాగా ఈ నిర్మాణ  సంస్థ నుండి వచ్చిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ  కలెక్షన్స్లు రాబట్టాయి. ఆర్య ,భద్ర,మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు కూడా ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చినవే. అయితే ఈ నిర్మాణ సంస్థ ద్వారా అభిమానుల కోసం మంచి సినిమాలతో పాటు ఇలా అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం చెప్పుకోదగ్గ విషయం.     

 

More Related Stories