సినిమా కార్మికులకు రవితేజ, సాయి తేజ్ చేయూత..

కరోనా వ్యాప్తి భయం కారణంగా షూటింగ్లు లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంలో భాగంగా హీరో రవితేజ 20 లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతుగా ఈ మొత్తాన్ని కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన తెలిపారు. ఇవ్వడమనే విషయం వచ్చేదాకా తీసుకోవడమనే ప్రయోజనం ఎప్పటికీ పూర్తికాదనీ తెలిపిన రవితేజ.. ఇది బాధను కొలవడం కాదు, సినీ కార్మికుల అవసరాలను తీర్చడంలో తోడ్పాటు మాత్రమే అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఇంటిపట్టునే సురక్షితంగా ఉండాలని కోరారు. ఆయనతో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా మరో 10 లక్షలు అనౌన్స్ చేసాడు. ఈయన ఇప్పటికే ముఖ్యమంత్రుల సహాయ నిధికి 10 లక్షలు ఇచ్చాడు. శర్వానంద్ 15 లక్షలు.. వరుణ్ తేజ్ 20 లక్షలు.. విశ్వక్ సేన్ 5 లక్షలు కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు కార్మికుల కోసం ఇచ్చాడు. ఇప్పటికే తెలుగు సినిమా కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించారు. దీన్ని చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇందులో ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు వరకు పోగు అయ్యానని ట్వీట్ చేసాడు చిరంజీవి. మహేష్ బాబు 25 లక్షలు.. రామ్ చరణ్ 30 లక్షలు.. జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు కూడా ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు కూడా.