English   

పాతికవేల మంది బ్యాంకు అకౌంట్లలో డబ్బు...దటీజ్ సల్మాన్

salman
2020-03-30 07:51:13

తమని స్టార్ లు చేసి ఇంత పెద్ద పొజిషన్ ఇచ్చిన ప్రేక్షక లోకాన్ని క్లిష్ట పరిస్థితుల్లో తాము ఉన్నామని భరోసా ఇస్తున్నారు కొందరు హీరోలు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన చాలా మంది హీరోలు విరాళాలు ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నడవనున్నాడు సల్మాన్‌ఖాన్.  తమ చిత్రపరిశ్రమలో పనిచేసే చిన్నాచితకా ఆర్టిస్టులకు ఆపన్నహస్తం అందించడానికి ఆయన సిద్దమయినట్టుగా చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. దేశం షట్ డౌన్ కావడంతో బాలీవుడ్ కి చెందిన ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. వారిలో 25 వేల మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా ఆడుకోవడానికి రెడీ అయ్యారు. బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారని సమాచారం. నేరుగా వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఒక్కసారి డబ్బు వేసేసి చేతులు దులుపుకోకుండా లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు ఆ పాతికవేల మంది యోగక్షేమాలు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చూసుకోనుందట.  

 

More Related Stories