English   

అడిగి మరీ సినిమా చేస్తోన్న అనుపమ...అందుకేనా

anupama
2020-03-30 07:59:49

2014లో నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' మంచి హిట్ గా నిలిచింది. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు గత ఏడాది మేలోనే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని భావించినా అది లేటయింది. మర్చి నెల మొదటిలో తిరుమలలో ఈ సినిమా ఓపెనింగ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ అంటూ పలువురి పేర్లు వినిపించాయి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అది నిజమేనని అంటున్నారు. ఎందుకంటే కార్తికేయ -2 డైరెక్టర్ చందు మొండేటి గతంలో దర్శకత్వం వహించిన 'ప్రేమమ్' సినిమాలో అనుపమ హీరోయిన్. ఈ పరిచయంతో అను కార్తికేయలో ఛాన్స్ అడిగి సంపాదించిందట. ముందు వేరే హీరోయిన్ ని అనుకున్నా అనుపమ వచ్చి అడగడంతో చందు మొండేటి హీరో నిఖిల్ ని అలాగే నిర్మాతలను కూడా ఒప్పించాడంట. నిజానికి తన కెరీర్ కొంచెం డల్ కావడంతోనే అడిగి మరీ ఈ సినిమా చేస్తోందట అనుపమ. అయితే నిఖిల్‌ సరసన ఎవరు నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా ఆగాల్సిందే. ఈ సినిమాని  తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

More Related Stories