రంగస్థలం మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ప్లాన్ చేస్తోన్న సుకుమార్

సుకుమార్ కలం నుండి వచ్చిన మంచి సినిమాల్లో ఒకరి రంగస్థలం అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. చాలా చిన్న ప్లాట్ అనుకుని దానిని ఒక సినిమాగా మలచడం అది కూడా పీరియాడిక్ సినిమాగా మలచడం మామూలు విషయం అయితే కాదు. అయితే అదేమీ అంత ఈజీగా జరగలేదు. షూటింగ్ పూర్తైనా కూడా కొన్ని సీన్స్ మళ్లీ రీ షూట్ చేసాడు సుకుమార్. అందుకే అనుకున్న దాని కంటే ఆలస్యమైంది ఆ సినిమా షూటింగ్. అయితే ఎలా అయితేనేమి సినిమా హిట్ కొట్టింది, పనయ్యింది. కానీ ఇప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయద్దని ఫిక్స్ అయ్యాడట సుక్కూ. ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుంది.
ఇందులో బన్నీ గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడన్న ప్రచారం మొదటి నుండీ జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనున్న ఈ కథలో స్మగ్లర్లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా ప్లాన్డ్ గా చేస్తున్నాడట సుకుమార్. చాల తక్కువ రోజులు షూట్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈసారి రన్ టైం విషయంలోనూ సుక్కూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో ?