English   

హీరోయిన్ ని వేధిస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్

Tollywood
2020-03-30 11:08:51

సినిమా అంటేనే రంగుల ప్రపంచం, అలాంటి రంగుల ప్రపంచంలో కావలిసింది ట్యాలెంట్ ఒక్కటే కాదు అదృష్టం కూడా. ఒక వ్యక్తికి ఒక సినిమా అవకాశం వచ్చింది అంటే ట్యాలెంట్ ఒక్క దానివలనే అని చెప్పలేం. అనుకోకుండా కొందరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. అలా వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకోవడమే కాక హిట్ కొడతారు. ఆ తర్వాత వారి నుండి మరో సినిమా వస్తుందని కూడా చెప్పలేము. అయితే ట్యాలెంట్, అదృష్టం ఎంత ఉన్నా కావాల్సింది క్యారెక్టర్. ఎప్పటి నుండో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం మీద మనం రకరకాల కధలు వింటూనే ఉన్నాం. కొందరు ఈ విషయం మీద ఉద్యమాలే జరిగాయి. అయినా పట్టించుకోని కొందరు నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 

ఈ సోది అంతా ఎందుకు అంటారా ? ఈ మధ్యనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఒక దర్శకుడు తన సినిమాలో నటించిన హీరోయిన్ ని ఇబ్బంది పెడుతున్నాడట. కరోనా దెబ్బకు అన్ని ఎక్కడికక్కడ లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ఇంట్లో ఒక్కడినే ఉంటున్నానని తనకు కంపెనీ ఇవ్వమని సదరు దర్శకుడు ఆ నటికి మెసేజులు చేస్తున్నాడట. అయితే తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు ఇలా మాట్లాడుతుండడంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తన మేనేజర్ తో చెప్పి బాధ పడుతోందట సదరు నటి. ఈ ఏడాదిలోనే రిలీజయిన సదరు సినిమాకి కలెక్షన్స్ పెద్దగా రాకున్నా విమర్శకుల ప్రసంశలు అయితే దక్కాయి. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా వివాదాస్పదం అవుతుంది అనుకుంటే దర్శకుడి తీరు వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అన్నట్టు ఆ దర్శకుడితో సినిమా చేయడానికి తెలుగులో ఒక పెద్ద సంస్థ కూడా ముందుకు వచ్చిందండోయ్.

More Related Stories