English   

ఎప్రిల్, మే కూడా కొత్త సినిమాల విడుదల ఉండదా ..

theaters
2020-03-30 19:59:53

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మరో రెండు నెలల వరకు కూడా కరోనా ప్రభావం ఉండేలా స్పష్టంగా కనిపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత ఒకవేళ ధైర్యం చేసి విడుదల చేసినా కూడా థియేటర్లకు జనం వస్తారా అనేది కూడా అనుమానమే. ఇప్పటికే వేల కోట్లు నష్టాలు వస్తున్న సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్నాయి. చాలా సినిమాల షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మరి ఈ నష్టాలను ఎవరు భరిస్తారు.. ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో వినిపిస్తున్నాయిప్పుడు ఇండస్ట్రీలో. పరిస్థితి చూస్తుంటే ఎప్రిల్ 15తో అయితే ఇది కచ్చితంగా అంతం కాదు. మరో 15 రోజుల నుంచి నెల వరకు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని అర్థమవుతుంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక ఆలోచిస్తుంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు.

తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇండస్ట్రీలలో చాలా సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కొన్ని భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న సినిమాలు కూడా ఇంటికే పరిమితం అయిపోయాయి. దాంతో నిర్మాతలకు నష్టాలు భారీగానే వస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ వైరస్ తమ కొంప ముంచుతుంది అంటూ గగ్గోలు పెడుతున్నారు నిర్మాతలు. వాళ్ళు ఎంతగా ఏడుస్తున్న కూడా ప్రభుత్వాలు మాత్రం కరుణించడం లేదు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే వైరస్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొన్ని రోజుల వరకూ ఎటువంటి సినిమా షూటింగ్స్ జరపడానికి లేదు అంటూ వారు హెచ్చరించారు. దానికి తోడు సినిమా థియేటర్స్ కూడా అన్ని మూసేశారు. ఇప్పటికే 12 సినిమాలకు పైగానే ఆగిపోయాయి. మే నుంచి ఒకేసారి ధార కడతాయి. వరసగా వచ్చే ఈ సినిమాలకు థియేటర్స్ కూడా సరిపోవేమో..?

More Related Stories