English   

బాలకృష్ణ మౌనం వెనుక అసలు కారణం ఏంటి..

nbk
2020-03-31 06:59:47

ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తానున్నాను అంటూ ముందుకు వచ్చే బాలకృష్ణ ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ అయిపోయాడు.. బసవతారకం హాస్పిటల్ లో అయ్యా కష్టం అంటూ వస్తే ఎంతో మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించే బాలకృష్ణ కరోనా వైరస్ బాధితుల విషయంతో పాటు కరోనా క్రైసిస్ చారిటీకి విరాళం ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు.. కనీసం సినిమా కార్మికులకు అయినా బాలయ్య ఎందుకు విరాళం ప్రకటించలేదు.. ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను వేధిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కరోనా వైరస్ బాధితుల కోసం ఊహించిన దానికంటే ఎక్కువ విరాళాలు ఇస్తున్నారు మన స్టార్ హీరోలు. అటు ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు సినిమా కార్మికుల కోసం కూడా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. చిన్న చిన్న హీరోల దగ్గర నుంచి చిరంజీవి వరకు వరకు ప్రతి ఒక్కరూ లక్షలు మొదలుకొని కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. తాజాగా నాగార్జున, వెంకటేష్ కుటుంబాలు కూడా కోటి రూపాయలు విరాళం అందించారు. అయితే అందరూ ఇస్తున్న కూడా ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ మాత్రం విరాళం అందించలేదు. అదే కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు సినిమా కార్మికుల కోసం విరాళంగా ప్రకటించాడు.

కానీ ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ మాత్రం స్పందించలేదు. ఆయన కేవలం సినిమా హీరో మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా. అందులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే. మిగిలిన వారితో పోలిస్తే ఈయనకు బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ నుంచి విరాళం రాకపోవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గతంలో చాలాసార్లు విరాళం ప్రకటించాడు బాలకృష్ణ. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటాడు. కానీ ఈ సారి మాత్రం ఎందుకో చాలా ఆలస్యం చేస్తున్నాడు నందమూరి వారసుడు. ఇప్పటి వరకు ఈయన విరాళం ప్రకటించకపోవడం వెనక ఏదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఖచ్చితంగా భారీ మొత్తమే బాలకృష్ణ మంచి వస్తుందని ఆశిస్తున్నారు వాళ్ళు. దాంతో పాటు తెలుగుదేశం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చాడని వారు నమ్ముతున్నారు.

 

More Related Stories