English   

సినీ కార్మికులకు వెల్లువలా విరాళాలు..ఎవరికి తగ్గట్టు వారు

tollywood
2020-03-31 14:26:55

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని చాపలా చుట్టేసిన కరోనా వైరస్ పై ప్రపంచ ప్రజలు కలిసి కట్టుగా పోరాడుతున్నారు. అందులో భాగంగా మన దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది రోజు వారీ పనులు కూలీలపై, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేసే రోజు వారీ కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఫండ్ కు విరాళాలు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. తాజాగా కరోనాపై పోరులో భాగంగా ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్.. తన వంతు సాయంగా రూ. 10 లక్షల వంతున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి చెరో రూ.10 లక్షల వంతున మొత్తంగా రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.

మరోవైపు,చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇవ్వగా ఇప్పుడు సీసీసీకి మరో రూ.20 లక్షలు అందచేశారు. దీంతో ఆయన విరాళం మొత్తం రూ.1.45 కోట్లకు చేరింది. ఇక మరో హీరో సందీప్ కిషన్ కూడా తన వంతుగా కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మూడు లక్షలు అందించాడు. దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్లలో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు. మరో హీరో సుశాంత్ క‌రోనా క్రైసిస్ చారిటీకి రూ. 2 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. అలాగే, షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సీసీసీకి రూ. 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. ఇక వెన్నెల కిషోర్ రూ.2 లక్షలు, సంపూర్ణేష్ బాబులు తమ వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

 

More Related Stories