అప్పటి చరణ్ కి...ఇప్పుడు చరణ్ కి చాలా తేడా ఉంది :రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఎంతో క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. దీనికి కారణం సినిమాలో వివిధ ఇండస్ట్రీ లకు చెందిన ప్రముఖ నటీ,నటులు నటిస్తుండగా. విడుదలైన పోస్టర్లు కూడా మరింత క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్బంగా "బీమ్ ఫర్ రామరాజు" అనే పేరుతో ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియోతో మరింత క్రేజ్ వచ్చింది. ఈ వీడియోలో చరణ్ నటన మరియు ఎన్టీఆర్ డైలాగ్లు అదిరిపోయాయని ప్రముఖులు మెచ్చుకున్నారు కూడా.
ఇదిలా ఉండగా చరణ్ కు ఇదివరకే బ్లాక్ బస్టర్ అందించిన రాజమౌళి అతడిపై ప్రశంసలు కురిపించాడు. రాజమౌళి మాట్లాడుతూ..'గతంలో చరణ్ తో 'మగధీర' చేశాను. అప్పుడు నేను చూసిన చరణ్ వేరు .. ఇప్పుడు నేను చూస్తున్న చరణ్ వేరు. 'రంగస్థలం' సినిమా చూసిన తరువాత నటన పరంగా చరణ్ చాలా మెట్లు ఎక్కేశాడనే విషయం నాకు అర్థమైంది. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఆయన నటనను చాలా ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూశాను. నటన పై చరణ్ కు ఉన్న అంకిత భావాన్ని గమనించాను. చరణ్ నటన ఆశ్చర్యంగానూ.. ఆనందంగానూ ఉంది" అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు.