English   

నిఖిల్ డబ్బివ్వకుండా డాక్టర్లకి ఇచ్చింది అందుకేనా

nikil
2020-03-31 08:05:49

అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్ తాజాగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఆయన కరోనా నేపధ్యంలో డాక్టర్స్ కు రక్షణగా కొన్ని మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చ‌ర్యలు చేపడుతున్న తరుణంలో సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ వంతుగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. అయితే అందరు దాదపుగా అందరూ డబ్బు విరాళంగా ఇస్తుంటే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన వంతు సహాయంగా డాక్టర్లకు చేయూత ఇవ్వడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాలను సైతం లెక్క చేయక క‌రోనా పేషెంట్స్ కి చికిత్స అందిస్తున్న డాక్టర్స్‌, మెడిక‌ల్ సిబ్బందికి అండగా నిలుస్తూ వారి ర‌క్షణ‌కి ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్స్ కిట్స్ భారీగా అందించడం అంటే మామూలు విషయం కాదు.

2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు, 2000 రీ-యూజ‌బుల్ గ్లోవ్స్, 2000 ఐ-ప్రొట‌క్షన్ గ్లాసులు, శానిటైజ‌ర్లు, 10000 ఫేస్ మాస్కులు ఈ కిట్స్ అన్నింటినీ గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేశాడు నిఖిల్.  అయితే ఆయన చేసిన పనిని అభినందిస్తూనే కొందరు మరో రకంగా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్  నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్‌ పల్లవి వర్మను నిఖిల్‌ వివాహం చేసుకోబోతున్నారు. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో  నిఖిల్  డాక్టర్ పల్లవి వర్మతో పెళ్లికి సిద్దమయ్యాడు. ఆమె డాక్టర్ కావడంతోనే డాక్టర్లు పడే కష్టాన్ని అర్ధం చేసుకుని ఇలా ఇస్తున్నాడని అంటున్నారు. ఏపీలోని భీమవరానికి చెందిన  పల్లవివర్మతో ఆయన పెళ్ళికి సిద్దమయ్యాడు. మరి కరోనా ఉన్నా పెళ్ళికి సిద్దమన్న ఆయన ఇప్పుడు పెళ్ళికి సిద్దం అవుతాడో లేదో చూడాలి.

 

More Related Stories