English   

ఓటీటీకి కలిసొచ్చిన కరోనా

ott
2020-03-31 08:11:10

ఏ రంగమైనా కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ జనరేషన్ కి తగ్గట్టు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆడియన్స్ తో డిస్ కనెక్ట్ ఏర్పుడుతోంది. మారుతున్న గ్లోబలైజైషన్ తో  సినిమా ఫీల్డ్ కూడా కొత్త పుంత్తలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సినిమా కోసం థియేటర్ కి పరుగులు తీసిన ప్రేక్షకులు ఇప్పుడు కూర్చున్న చోటే సినిమాను ఆస్వాధిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని సినిమా  నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా అరచేతిలోకి వచ్చేసింది. సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్ టైన్ మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా కంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌’దే పై చేయి అయ్యే చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి.

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఇప్పుడు సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని దాటి ఆడియన్స్ ని థియేటర్స్ కి కష్టమైపోతోంది. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్ ఇప్పుడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. థియేటర్ కి వెళ్లి రెండు వందలు పెట్టి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూసే బదులు అదే రెండు వందలు పెడితే కొత్త సినిమాలన్ని వరుస పెట్టి చూడొచ్చనే విధంగా ఆడియన్స్ మైండ్ థాట్ ని డిజిటల్ ప్లాట్ ఫామ్ మార్చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిదేం లేదు. మారిన పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆడియన్స్ కి సినిమాను మరింత దగ్గర చేసింది. అంతేకాదు ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్మాతలకు అదనపు రాబడి తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వరంగా మారిందనే చెప్పాలి. టాక్ బాగుండి థియేటర్స్ లో ఆడని సినిమాలకు ఓటీటీ లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న సినిమాల నిర్మాతలకు డిజిటల్ మీడియా ధైర్యం ఇస్తోందని చెప్పొచ్చు. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులతో మేకర్స్ సినిమాను ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కరోనా దానికి మరింత ఊతం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందకంటే కరోనా దెబ్బకు ఇప్పటికే హాల్స్ మూత పడ్డాయి. ఇక ప్రేక్షకుల ఏకైక టైం పాస్ ఒటీటీగా మారింది. చూడాలి మరి ఈ కరోనా ఒటీటీకి ఏమేరకి సహాయపడుతుందో ?

 

More Related Stories