ఆచార్య ఫస్ట్ లుక్ డేట్ అదేనా

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. ఈ మూవీకి సంభందించిన ప్రతి న్యూస్ ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అభిమానుల కోసం చిరు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని యూనిట్ భావిస్తుందట. శ్రీ రామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఆచార్యను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
లాక్డౌన్ నేపథ్యంలో చిత్ర బృందం ఎవరి ఇంట్లో వాళ్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడం కోసం శ్రమిస్తున్నారని అంటున్నారు. ఇటీవలే చిరు ట్విటర్ ఖాతా తెరిచైనా సంగతి తెలిసిందే. ఇక తన ఫస్ట్ లుక్ తనే స్వయంగా ట్విటర్లో పంచుకుంటారని చెబుతున్నారు. ఈ సినిమాలో కాజల్ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి ముందుగా సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఎందుకో కానీ అది కుదరలేదు.