English   

తీవ్ర విషాదంలో సల్మాన్‌ ఖాన్‌ 

  Salman Khan
2020-03-31 18:03:26

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ హఠాన్మరణం పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన వయసు 38 సంవత్సరాలని చెబుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, నిన్న రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు సల్మాన్. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము" అంటూ తన ట్విటర్‌ ఖాతాలో అబ్దుల్లా గురించి పోస్ట్ చేశాడు. ఇక అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించాడని అంటున్నారు. ఇక అబ్దుల్లా మృతి విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌ తో కలిసి ఎన్నో ఈవెంట్స్ లో కనిపించేవాడు. 

More Related Stories