English   

షాకింగ్.. హీరో విజయ్‌కు కరోనా పరీక్షలు..

 Vijay
2020-03-31 13:16:15

ఈ మధ్య తమిళ హీరో దళపతి విజయ్ సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. మొన్నటికి మొన్న ఈయన ఇంట్లో వరసగా రెండు మూడు రోజుల పాటు ఐటి రైడ్స్ రెండు సార్లు జరిగాయి. అప్పుడే సంచలనంగా మారింది విషయం. ఇక ఇప్పుడు ఈయనకు కరోనా పరీక్షలు చేసారంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కొన్ని రోజుల ముందు వరకు కూడా మాస్టర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఈయన. బయటి దేశానికి కూడా వెళ్లలేదు. అంతా చెన్నై చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి కొందరు ఆరోగ్య శాఖ నిపుణులు వచ్చి ఈయనకు కరోనా పరీక్షలు చేయడం సంచలనంగా మారుతుంది. ఈయన ఇంట్లో కూడా ఆరోగ్య శాఖ ప్రతినిధులు వచ్చి తనిఖీలు నిర్వహించారనే వార్తలు ఇఫ్పుడు తమిళనాట వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది తెలిసిన తర్వాత అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా విజయ్ బయటికి వచ్చి మాట్లాడలేదు. ఆయన క్లారిటీ ఇస్తే అసలేం జరిగిందనేది తెలుస్తుంది. అప్పటి వరకు టెన్షన్ పడొద్దని విజయ్ అభిమాన సంఘాలు కోరుకుంటున్నాయి. మొత్తానికి విజయ్ ను అయితే బాగానే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య. 

More Related Stories