శ్రీను వైట్లతో పని చేయడానికి నేను రెడీ.. కోన వెంకట్..

ఇగోలు పక్కన బెట్టి శ్రీను వైట్లతో పని చేయడానికి సిద్ధమే అంటున్నాడు కోన వెంకట్. ఈ కాంబినేషన్ మళ్లీ చూడొచ్చా అంటే నిస్సందేహంగా చూడొచ్చుఅంటున్నాడు ఈయన. అలీతో సరదాగా షో పుణ్యమా అని మరోసారి శ్రీను వైట్ల, కోన వెంకట్ టాపిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈయన మరోసారి శ్రీను వైట్ల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తను వైట్లకు దూరంగా జరగడానికి కారణం కూడా చెప్పాడు కోన. మనిషికి ఏదైనా ఉండొచ్చు గానీ ఇగో మాత్రం ఉండకూడదు. దాని వల్ల కెరీర్స్ మాత్రమే కాదు.. జీవితాలే నాశనమైపోతుంటాయి. ఇండస్ట్రీలో ముగ్గుర్ని చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. టాలీవుడ్ లో ఐదేళ్ల కింది వరకు శీనువైట్ల ఓ కింగ్.. ఆయనేం చెబితే అదే రూల్. డిక్టేటర్ తరహాలో రూల్ చేసేవాడు శీనువైట్ల. కానీ ఇప్పుడు ఆయన కెరీర్ నేలమట్టం అయిపోయింది.
శీనువైట్ల కింగ్ కావడానికి.. ఆయన కెరీర్ ఇలా నాశన మైపోవడానికి వెనక ఉన్న కారణం కోనవెంకట్, గోపీమోహన్. ఈ ముగ్గురు కలిసారంటే సినిమా కచ్చితంగా హిట్.. కనీసం యావరేజ్. నిర్మాత డబ్బులు అయితే ఎక్కడా పోవు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు త్రిమూర్తులు. కానీ ఇగో ఈ ముగ్గురి కెరీర్స్ తో ఆడుకుంది. శీనువైట్ల ప్రతీ సినిమాలో తమ క్రెడిట్ కొట్టేస్తున్నాడంటూ అప్పట్లో కోన వెంకట్ ఓపెన్ గానే రచ్చ చేసాడు. అయితే తన కథలను శ్రీను కంటే కూడా ఎవరూ బాగా అర్థం చేసుకోలేదని.. ఇప్పటికి తనకు శ్రీను అంటే చాలా ఇష్టం అంటున్నాడు కోన. తను ఓకే అంటే వర్క్ చేయడానికి కూడా రెడీ అంటున్నాడు. కాకపోతే అప్పట్లో తను రాసిన డైలాగులను, మాటలను, కథను కూడా తను కాస్త మార్చుకుని పూర్తిగా తన పేరు వేసుకునేవాడని చెప్పాడు ఈయన. ఓ టైమ్ లో తనకు రావాల్సిన గుర్తింపు రావడం లేదనే బాధతోనే బయటికి వచ్చినట్లు చెప్పాడు కోన వెంకట్.
కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను.. శ్రీను వైట్లకు ఉన్న కామెడీ టైమింగ్ అద్భుతం అంటూ పొగిడేసాడు ఈయన. మరోసారి కూడా ఇప్పుడు అదే చెప్పాడు ఈయన. కానీ క్రెడిట్స్ విషయంలోనే ఈ ఇద్దరికి అస్సలు పడటం లేదు. కోన తనపై చేసిన వ్యాఖ్యలు వైట్లకు నచ్చలేదు. దాంతో ఇద్దరూ విడిపోయారు. గోపీమోహన్ కూడా శీనువైట్ల నుంచి దూరంగా జరిగాడు. వీళ్లిద్దర్ని పక్కనబెట్టి వైట్ల చేసిన ఆగడు అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత బ్రూస్ లీ కోసం కలిసి పనిచేసినా.. మనసు పెట్టి పని చేయలేదు. అందుకే ఆ సినిమా కూడా డిజాస్టరే. ఇప్పుడు మిస్టర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అమర్ అక్బర్ ఆంటోనీ అడ్రస్ లేదు. మరోవైపు కోనవెంకట్ కెరీర్ కూడా ఇప్పుడు పడిపోయింది. ఈయనకు కూడా ఇప్పుడు సినిమాలు ఇచ్చేవాళ్లు కరువయ్యారు. మొత్తానికి ఇగోతో ఇప్పుడు ముగ్గురి కెరీర్స్ ఎటూ కాకుండా పోయాయి.