కరోనా హాలీడేస్లో కాజల్ ఏం చేస్తుందో తెలుసా..

అనుకోకుండా అందరికీ కరోనా హాలీడేస్ వచ్చాయి. కనీసం ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టలేని సెలవులు ఇవి. దాంతో అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ముఖ్యంగా స్టార్స్ కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు. వాళ్లు అస్సలు బయటికి రావడం లేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే చేస్తుంది. తాను కూడా ఇంట్లో కూర్చుని ఊరికే టైమ్ పాస్ చేయడం ఎందుకు ఏదో ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది కదా అంటుంది. అందుకే తను ఈ సెలవుల్లో కళరి నేర్చుకోవాలని చూస్తుంది. కేరళలో బాగా ఫేమస్ అయిన ఈ యుద్ద విద్యను ఇప్పుడు నేర్చుకుంటుంది ఈమె. ఎలాగూ మరో 15 రోజులు బయటికి వెళ్లేది లేదు.. ఇప్పటికే 10 రోజులు హాలీడేస్ అయిపోయాయి.. దాంతో ఈ నెల రోజులు కళరికి అప్పగించేసింది కాజల్. తన లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా నేర్చుకున్నదే కానీ ఖాళీగా ఉండేకంటే ఏదో ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది కదా అనే మనస్తత్వం తనది అంటుంది. పైగా ఇప్పుడు ఆమె నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కళరి విద్య కూడా అవసరం. దాంతో స్వామికార్యం స్వకార్యం రెండు ఒకేసారి పూర్తి చేస్తుంది ఈమె. చిరంజీవి ఆచార్యలో కూడా కాజలే హీరోయిన్. ఖైదీ నెం 150 తర్వాత చిరుతో కలిసి కాజల్ నటిస్తున్న రెండో సినిమా ఇది.