కరోనా హాలీడేస్ అలా వాడేసుకుంటున్న సుహానా ఖాన్..

సుహానా ఖాన్.. వయసు 21.. తండ్రి షారుక్ ఖాన్.. కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో.. అంతటి ఇమేజ్ ఉన్న హీరో కూతురు అయి ఉండి కూడా ఎలాంటి భయం బెరుకు లేకుండా బికినీలో రచ్చ చేస్తుంది సుహాన. అదే టాలీవుడ్ లో కానీ ఏ హీరో కూతురైనా అలా చేస్తే రచ్చ రంబోలే. కానీ బాలీవుడ్ లో మాత్రం అలాంటి హద్దులే ఉండవు. ఇక్కడ హీరోయిన్ అవుతానంటేనే హీరోల అభిమానులు గోల పెడుతుంటారు. కానీ అక్కడ మాత్రం బికినీలు వేసుకుని లిప్ లాక్స్ కూడా ఇచ్చుకుంటారు. అంత పబ్లిక్ లైఫ్ కు అలవాటు పడిపోయారు. ఇప్పుడు షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా ఇదే చేస్తుంది. నిండా 22 ఏళ్లు కూడా లేకుండానే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది బాలీవుడ్ లో. మాట్లాడితే బికినీలు వేసుకుని ఫ్రెండ్స్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తండ్రి స్టార్ డమ్ ఉంది.. అతడి పేరు ఏమైనా పాడవుతుందా అనే ఆలోచనలు కూడా సుహానకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇవన్నీ కామన్ అన్నట్లుగా కింగ్ ఖాన్ కూడా కూతురు చేష్టలను లైట్ తీసుకుంటున్నాడు. మరోవైపు షారుక్ భార్య గౌరీనే దగ్గరుండి మరీ కూతురు సుహానాను హాట్ గా రెడీ చేసి పబ్లిక్ ఫంక్షన్ లకు తీసుకొస్తుంది. ఇప్పుడు కరోనా హాలీడేస్ లో భాగంగా ఇంట్లోనే ఉండి మేకప్ టిప్స్ నేర్చుకుంటుంది సుహానా. ఇదే విషయాన్ని అమ్మ గౌరీ ఖాన్ కూడా చెబుతుంది. ఇంట్లోనే ఉండి చేసే పని కావడంతో మేకప్ టిప్స్ నేర్చుకుంటుందని చెప్పింది గౌరీ ఖాన్. మొత్తానికి త్వరలోనే ఈమె ఇండస్ట్రీకి రానుంది. ప్రస్తుతం న్యూ యార్క్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తుంది సుహానా ఖాన్. వచ్చే ఏడాది ఈమె ఎంట్రీ ఉండొచ్చు.