English   

ఎప్రిల్ ఒక్కటే కాదు.. మే కూడా టాలీవుడ్‌కు నష్టమే... 

 Tollywood
2020-04-01 12:56:14

ఇప్పటి వరకు తెలుగు సినిమా మొదలైన తర్వాత ఇంత బ్రేక్ ఎప్పుడైనా వచ్చిందో లేదో మరి. నెల రోజులుగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. భారీ సినిమాల మాట దెవుడెరుగు చిన్న సినిమాలు కూడా రావడం లేదు. 15 రోజులుగా థియేటర్స్ అన్నీ మూత పడిపోయాయి. రాకాసి కరోనా వచ్చి అందరి నోళ్లలో మట్టి కొడుతుంది. బయటికి వెళ్తే మనల్ని కుడుతుంది. దాంతో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిస్థితులు అంత బాగోలేవు. మరో రెండు నెలల వరకు కూడా ఈ కరోనా ప్రభావం భారీగానే ఉండేలా కనిపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత ధైర్యం చేసి విడుదల చేసినా కూడా థియేటర్లకు జనం వస్తారా అనేది అనుమానమే.

 మూలినే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు కరోనా కాటు మరింత దారుణంగా మారిపోయింది. చాలా సినిమాల షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మరి ఈ నష్టాలను ఎవరు భరిస్తారనేది కూడా అర్థం కావడం లేదు. మరోవైపు నిర్మాతలు తీసుకొచ్చిన కోట్లకు వడ్డీలు పెరుగుతున్నాయి. సినిమా కార్మికులు తిండి లేక అల్లాడుతున్నారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక ఆలోచిస్తుంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇండస్ట్రీలలో చాలా సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కొన్ని భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న సినిమాలు కూడా ఇంటికే పరిమితం అయిపోయాయి. దాంతో నిర్మాతలకు నష్టాలు భారీగానే వస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ వైరస్ తమ కొంప ముంచుతుంది అంటూ గగ్గోలు పెడుతున్నారు నిర్మాతలు. 

వాళ్ళు ఎంతగా ఏడుస్తున్న కూడా ప్రభుత్వాలు మాత్రం కరుణించడం లేదు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే వైరస్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొన్ని రోజుల వరకూ ఎటువంటి సినిమా షూటింగ్స్ జరపడానికి లేదు అంటూ వారు హెచ్చరించారు. దానికి తోడు సినిమా థియేటర్స్ కూడా అన్ని మూసేశారు. ఇప్పటికే 12 సినిమాలకు పైగానే ఆగిపోయాయి. మే నుంచి ఒకేసారి ధార కడతాయి. వరసగా వచ్చే ఈ సినిమాలకు థియేటర్స్ కూడా సరిపోవేమో..? 

More Related Stories