English   

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకా ఆలస్యం కానుందా..

 Akhil
2020-04-01 17:08:07

అఖిల్ సినిమాకు మళ్లీ తిప్పలు తప్పేలా లేవు. ఈయన నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు ఇప్పట్లో మోక్షం వచ్చేలా కనిపించడం లేదు. సినిమా పూర్తైన తర్వాత కూడా నాగార్జున కొన్ని మార్పులు సూచించాడని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు కొన్ని షాట్స్ కూడా మిగిలిపోయాయి. దాంతో సినిమా అనుకున్న సమయం కంటే మరో మూడు నాలుగు నెలలు ఆలస్యంగా వచ్చేలా కనిపిస్తుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తెలుగులో బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమా ఇది. నాగార్జున కూడా ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత దర్శకుడికి కొన్ని సీన్లు ఎడిట్ చేయాలని ఆర్డర్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అఖిల్ కెరీర్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కీలకంగా మారింది. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో నిలబడాలి అంటే కచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ కావాల్సిందే. దానికితోడు అప్పుడెప్పుడో పదేళ్ల కింద పరుగు సినిమాలో పర్లేదనిపించిన బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు కూడా పెద్దగా లేవు. అయితే గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో కాస్తోకూస్తో ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు సినిమా మొత్తం పూర్తయిన తర్వాత చూస్తే కొన్ని సన్నివేశాలు నాగార్జునకు నచ్చలేదని తెలుస్తోంది. దాంతో వాటిలో కొన్ని మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ముందు ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా మే లేదంటే జూన్ జూన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా పోయి మరో రెండు నెలలు ఆలస్యంగా వచ్చేలా కనిపిస్తుంది. 

More Related Stories